Tuesday, November 26, 2024

రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ఆలోచన లేదు : కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఇతర రాష్ట్రాల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మంగళవారం రాతపూర్వక జవాబిచ్చారు.

రాష్ట్రాల వారీగా దేశంలోని ఎరువుల రిటైల్ షాపులు, పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాల వివరాలు తెలపాలని, ఎరువుల రిటైల్ షాపులను మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందా అంటూ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి సవివరంగా సమాధానమిచ్చారు. ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి పేరుతో మోడల్ ఫెర్టిలైజర్ రిటైల్ దుకాణాలు రైతులకు వన్ స్టాప్ షాప్‌గా పని చేస్తున్నాయని తెలిపారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు మొదలైన ఉత్పత్తులు, ఇతర సేవలను పీఎంకేఎస్‌కేలలో పొందవచ్చని తెలిపారు. 

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement