Friday, November 29, 2024

TG | ఉచిత కరెంటు వస్త లేదు… సబ్సిడీ గ్యాస్‌ లేదు

  • మంత్రి పొన్నంను ప్రశ్నించిన మహిళలు

చిగురుమామిడి, (ఆంధ్రప్రభ): ఉచిత కరెంట్‌, గ్యాస్‌ సబ్సిడీ మా కుటుంబాలకు రావడం లేదంటూ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మహిళలు ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముది మాణిక్యం గ్రామంలో శుక్రవారం నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి పోన్నం ప్రభాకర్‌ను ఉచిత కరంటు, సబ్సిడీ గ్యాస్‌ వంటి సంక్షేమ పథకాలు మాకు రావడం లేదంటూ మహిళలు పొన్నం ప్రభాకర్‌ దృష్టికి తీసుకువెళ్లారు.

గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో గ్రామానికి చెందిన దాదాపు 87 కుటుంబాల ప్రజా పాలన దరఖాస్తులు అధికారుల నిర్లక్షం వల్ల ఆన్‌లైన్‌ చేయకుండా వదిలేయడం ద్వారా ప్రభుత్వం నుండి రావాల్సినఉచిత కరెంటు, 500 గ్యాస్‌ సబ్సిడీ వంటి సంక్షేమ పథకాలు అందడం లేదని వివరించారు.

ఈ విషయాన్ని అధికారులకు చెప్పిన కూడా కనీస స్పందన లేకుండా పోయిందని మంత్రి దృష్టికి మహిళలు తీసుకెళ్లారు. మంత్రి మాట్లాడుతూ 200 యూనిట్లలోపు విద్యుత్‌ కాల్చిన ప్రతి కుటుంబానికి కరెంటు బిల్లు ఉచితమని, 500కే గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తున్నామని తెలిపారు. గ్రామంలో మిస్సయిన 87 ప్రజా పాలన దరఖాస్తులను వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ప్రజా పాలన దరఖాస్తులలో ఏర్పడిన ఆన్‌లైన్‌ సమస్య పరిష్కరిస్తామని మంత్రి మహిళలకు హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement