Saturday, November 23, 2024

చంపేస్తున్న శానిటైజర్స్

కరోనా నేపథ్యంలో వ్యక్తిగత శుభ్రతకు బాగా ప్రాధాన్యత పెరిగింది. చేతుల పరిశుభ్రతకి శానీ టైజర్స్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఒక్కప్పుడు ఇవి వైద్యశాలల్లో మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఇవి అందరికి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇటీవల శానిటైజ
ర్స్ తాగి చనిపోయేవారి సంఖ్య పెరుగుతోంది. అతి సర్వత్రా వర్జయేత్ అన్నది శానిటైజర్ విష యంలోనూ వర్తిస్తుంది. అధిక మోతాదులో శాని టైజర్ వాడటం వల్ల మన అరచేతుల్లోని మంచి
బ్యాక్టీరియా చనిపోతుంది. ఈ మంచి బ్యాక్టీరి యామన చర్మాన్ని, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచ టంలో ఎంతో ఉపయోగపడుతుంది. మంచి బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్లకపోతే మనం రోగాల బారిన పడటం ఖాయం. అంతేకాకుండా తరచుగా శానిటైజర్ వాడుతున్నట్లయితే చేతుల్లో ఉండే చెడు బ్యాక్టీరియా శక్తివంతంగా తయారవుతుంది.

శానిటైజరకు అలవాటుపడి, నిరోధక శక్తిని పెంచుకుంటుంది. ఇక మనం శానిటైజర్‌తో స్నానం చేసినా లాభం లేకుండా పోతుంది. అయితే మనం శానిటైజర్‌ను ఎక్కువగా వాడుతున్నామా లేదా తెలుసుకోవటం ముఖ్యం.సబ్బు, నీరు అందుబాటులో ఉన్నప్పుడు కచ్చితంగా శానిటైజర వాడకానికి దూరంగా ఉండండి. ఓ 20 సెకన్ల
పాటు సబ్బు నీళ్లతో చేతుల్ని కడుక్కోవటం ద్వారా క్రిముల్ని తరిమికొట్టొచ్చని ‘యూఎస్సెం టర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్” చెప్తుంది.చుట్టుప్రక్కల ఉన్న వారు తుమ్మినా,
దగ్గినా కొంతమంది వెంటనే శానిటైజర్ రాసుకుంటుంటారు. ఇలా చేయటం వల్ల ఏ లాభమూ ఉండదు. గాల్లోని క్రిములను శానిటైజర్ చంపలేదని గుర్తించాలి. అదో భయానికి గురికాకుండా తరచూ దాన్ని వాడటాన్ని తగ్గించుకోవాలి. శానిటైజర్ తాగేందుకు పనికిరాదు.అందులో గెజిన్ కలుపుతారు. దీనివల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని లిపిడ్ న్యుమోనియా వస్తుందని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు. క్రమంగా కిడ్నీలు కూడా పాడవుతాయి.స్వల్ప కాలంలోనే వాంతులు, విరేచనాలతో చనిపోతారు.మద్యం ధరలు
ఎక్కువ ఉండటంతో కొంతమంది శానిటైజర్తీసుకుంటున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం అని గుర్తించాలి. ప్రజలలో వీటిపై అవగాహన
కల్పించాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement