Friday, November 22, 2024

వీకెండ్స్​లో సందడే సందడి, అనంతగిరిలో జన జాతర.. క్యూ కడుతున్న సిటీ​ జనం!

వీకెండ్​ (ఆదివారం) వచ్చిందంటే చాలు హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున పర్యాటకులు అనంతగిరికి తరలివస్తున్నారు. సహజ సిద్ధ‌ వాతావరణంతో పాటు ప్రకృతి రయణీయత మధ్య ఆహ్లదకరంగా ఉండే అనంతగిరిని చూడ్డానికి సిటీ జనం అధికంగా ఇష్టపడుతున్నారు. అయితే.. ఇక్కడ చూడదగిన ప్రదేశాలు కూడా చాలా ఉండడమే దీనికి కారణం.. ఒకవైపు అందమైన అటవీ అందాలు, మరోవైపు జలజల మని జాలువారే వాటర్​ ఫాల్స్​.. కోట్​పల్లిలో బోటింగ్​, ఆ తర్వాత బుగ్గ రామలింగేశ్వరస్వామి దర్శనం ఇవన్నీ ఇక్కడి ప్రత్యేకతలని చెప్పవచ్చు.

వికారాబాద్‌, (ప్రభ న్యూస్‌): నిజాం నవాబ్‌ కాలం నుండి ‘అనంతగిరికా హవా లాకో మరిజోంకా దవా’ అన్న సామెతకు అనుగుణంగా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన చెట్లు ఉన్నాయి. అనంతగిరి ప్రాంతానికి వస్తే స్వచ్ఛమైన ఆక్సిజన్‌తో పాటు ఎత్తెన గుట్టలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడ పర్యాటక శాఖకు చెందిన హోటల్‌ హరితతో పాటు పలు ప్రైవేట్‌ రిసార్ట్‌లు ఉండటం ఈ ప్రాంతానికి టూరిస్టులను ఆకర్షిస్తుంది. అనంతగిరిలో అనంత పద్మనాభ స్వామి ఆలయంతో పాటు నంది ఘాట్‌ చూపరులను ఆకట్టుకుంటుంది. ఈ నంది ఘాట్‌ మీదుగా దాదాపు 2 కిలో మీటర్లు నడిచి వెలితే వాటర్‌ ఫాల్స్‌ కనిపిస్తాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు మాత్రమే వాటర్​ఫాల్స్​ కనిపించటం విశేషం.

ఇక.. అనంతగిరి కొలనులో నీరు ఎప్పుడు నిండుగానే ఉంటుంది. గతంలో మాదిరిగా కొలనులోకి భక్తులను వెల్లనీయక పోవటంతో ఆ నీరు అలానే ఉంటుంది. ఈ అనంతగిరితో పాటు సమీపాన గల బుగ్గ రామలింగేశ్వరాలయం, కోట్‌ పల్లి ప్రాజెక్ట్‌ను చూడడానికి పర్యాటకలు ఎక్కువగా వస్తుంటారు. గతంలో కేవలం హరిత మాత్రమే ఉండగా ఇటీవల వెలిసిన పలు ప్రయివేట్‌ రిసార్ట్‌ల మూలంగా హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌లు జంటలుగా ఇక్కడికి విచ్చేస్తున్నారు. మంచి వాతావరణం ఉండటం, వాటర్‌ ఫాల్స్‌ తదితర అంశాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.

ప్రభుత్వ పరంగా పర్యాటక అభివృద్ధి ఏమీ లేనప్పటికీ ప్రయివేట్‌ పరంగా పెద్ద ఎత్తున అనంతగిరి అభివృద్ధి సాధిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో నిర్మించిన హరిత రిసార్టు తప్ప మరే అభివృద్ధి ప్రభుత్వ పరంగా చేయలేదు. ప్రతి ఆది వారాలలో పెద్ద మొత్తంలో పర్యాటకులు విచ్చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అనంతగిరిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేకు నిధులు కేటాయించాలని స్ధానికులు కోరుతున్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్నాటయ్యే అవకాశాలు లేనందున కనీసం
పర్యాటక రంగం అయినా అభివృద్ధి చెందితే ఈ ప్రాంత వాసులకు ఉపాధి కలుగుతుందని స్దానికులు పేర్కోంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement