ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి రేషన్ పంపిణీ అంటూ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ రేషన్ ను ఇంటింటికి పంపిణీ చేసేందుకు వాహనాలను కూడా తీసుకు వచ్చారు. ఇక ఈ పథకం ప్రారంభమైన కొద్దిరోజుల్లోనే వాహన డ్రైవర్లు జీతాలు సరిపోవంటూ ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా ఇంటింటికి రేషన్ పంపిణీ పేరుతో ప్రవేశపెట్టిన ఈ వాహనాలను రకరకాలుగా ఉపయోగిస్తున్నారు.
అందుకు సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ వాహనంలో పుల్లలను తీసుకెళ్తున్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. గ్యాస్ ధర పెరిగినందున ఇంటికే పుల్లలు జగనన్న పుల్లల పథకం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు.