Saturday, November 23, 2024

బీబీసీ వరల్డ్‌ కప్‌ జట్టులో ముగ్గురు ఇండియన్స్‌

టీ 20 వరల్డ్‌ కప్‌ ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం సాధించిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ చరిత్రలో తొలి డబుల్‌ వరల్డ్‌ చాంపియన్‌గా అవతరించింది. మెల్‌ బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన ఫైనల్లో పాకిస్థాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి టీ 20 ప్రపంచకప్‌ టైటిల్‌ను రెండో సారి గెలుచుకుంది. ఇంగ్లండ్‌ ఇప్పటికే వన్డే ప్రపంచకప్‌ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.

కాగా టీ 20 వరల్డ్‌ కప్‌ సందర్భంగా ఇంగ్లాండ్‌ వార్తా వెబ్‌ సైట్‌లో బీబీసీ ఒక సర్వే నిర్వహించింది. 11 మంది ఆటగాళ్లతో కూడిన మిశ్రమ జట్టును ఏర్పాటు చేయాలని ప్రజలను కోరింది. వారి సర్వే ఫలితాల ఆధారంగా బీబీసి వరల్డ్‌ కప్‌ జట్టు సిద్దమైంది. ఇందులో టీమిండియా ఆటగాళ్లు ముగ్గురికి చోటు లభించడం విశేషం.

- Advertisement -

బీబీసీ వరల్డ్‌ కప్‌ జట్టు
జోస్‌ బట్లర్‌,
అలెక్స్‌ హేల్స్‌,
విరాట్‌ కోహ్లీ,
సూర్యకుమార్‌ యాదవ్‌,
గ్లెన్‌ ఫిలిప్స్‌,
హార్థిక్‌ పాండ్యా,
షాదాబ్‌ ఖాన్‌,
సామ్‌ కురియన్‌,
షా అఫ్రిదీ,
ఎన్రిక్‌ నోర్త్యా,
మార్క్‌ వుడ్‌,
వీరితో పాటు సికిందర్‌ రజా, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, బెన్‌ స్టోక్స్‌, అర్షదీప్‌ సింగ్‌, వనిందు హసరంగాలను కూడా ప్రజలు ఎంపిక చేసినట్లు బీబీసీ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement