సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పదకొండు నెలల పాలనలో రేవంత్ నోటి నుంచి బూతులు తప్ప నీతులు రలేదు అని అన్నారు. కాంగ్రెస్ విజయోత్సవ సభ అని పేరు పెట్టుకుని.. తాము చేసిందేమీ లేక, చెప్పేదేమీ లేక ఎప్పటిలాగే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు.
ఎంత గింజుకున్నా లాభం లేదు
సీఎం రేవంత్ రెడ్డి ఎంత గింజుకున్నా లాభం లేదు.. అశోక్ నగర్ నుంచి లగచర్ల దాకా, రైతుల నుంచి లంబాడీల దాకా ఈ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలను తెలంగాణ ప్రజలు మరిచిపోరని హరీశ్‌రావు అన్నారు. రేవంత్… కేసీఆర్ నామస్మరణ చేసినంత మాత్రాన నీ పాపం పోదు… కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తి జీవితంలో నీకు అర్థం కాదు అని అన్నారు.
తొక్కుకుంటూ వచ్చానని గొప్పాలు కొడుతున్నావు అని, అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నాయకులను తొక్కినావు అని విమర్శించారు. షార్ట్ కట్ లో అధికారం చేజిక్కించుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రజలను తొక్కుతున్నావు అని మండిపడ్డారు.