Saturday, November 23, 2024

గ్లోబల్‌ఫార్మా కంటి మందులో కలుషితాలు లేవు.. తమిళనాడు డ్రగ్‌ రెగ్యులేటరీ సంస్థ వివరణ

గ్లోబల్‌ ఫార్మా కంపెనీ ఐడ్రాప్స్‌ వల్ల బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ అవుతున్నట్లు అమెరికా చేసిన ఆరోపణల్ని తమిళనాడు డ్రగ్‌ రెగులేటరీ సంస్థ తోసిపుచ్చింది. గ్లోబల్‌ ఫార్మా తయారు చేస్తున్న ఆర్టిఫిషియల్‌ టియర్స్‌ కంటి చుక్కల్లో ఎటువంటి కలుషిత పదార్ధాలు లేవని తెలిపింది. ఆ ఐడ్రాప్స్‌ వేసుకోవడం వల్ల కొందరిలో అంధత్వం వస్తుందని, కొందరు చనిపోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చెన్నై ప్లాంట్‌లో తయారు చేసిన ఐడ్రాప్స్‌ శ్యాంపిళ్లను పరీక్షించామని, వాటిల్లో ఎటువంటి కంటామినేషన్‌ లేదని తమిళనాడు డ్రగ్స్‌ కంట్రోల్‌ డైరక్టర్‌ పీవీ విజయలక్ష్మీ తెలిపారు.

అనేక బ్యాచ్‌లకు చెందిన ఐడ్రాప్స్‌ శ్యాంపిళ్లను టెస్ట్‌ చేశామన్నారు. కంటి చుక్కల తయారీ కోసం వాడే ముడి సరుకులు కూడా నాణ్యత ప్రకారమే ఉన్నట్లు డ్రగ్‌ డైరెక్టర్‌ చెప్పారు. అమెరికాకు చెందిన సీడీసీ చేసిన ఆరోపణలపై స్పందించేందుకు విజయలక్ష్మీ నిరాకరించారు. అమెరికాకు ఎగుమతి చేసిన ఇజ్రికేర్‌ ఆర్టిఫిషియల్‌ టియర్స్‌ వల్ల ముగ్గురు మరణించారని, ఎనిమిది మంది చూపు కోల్పోయారని, పదుల సంఖ్యలో ఇన్‌ఫెక్షన్‌ కేసులు నమోదయ్యాయని సీడీసీ భావిస్తున్నది. సూడోమోనాస్‌ ఎరుగినోసా అనే బ్యాక్టీరియా ఈ ఐడ్రాప్స్‌ ద్వారా సోకిందని, ఇది రక్తం, ఊపిరితిత్తులు, గాయాలలో ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుందని సీడీసీ సందేహం లేనవెత్తింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement