Tuesday, November 19, 2024

నీళ్ల కోసం అన్ననే చంపిన తమ్ముడు… పైగా కట్టుకథలు

నీళ్ల విషయంలో అన్న దమ్ముల ఘర్షణ రావటంతో అన్నను చంపేశాడు ఓ తమ్ముడు. అన్నను పారతో కొట్టి చంపి వ్యాయామం చేసే డంబల్స్ మీద పడి చనిపోయినట్టుగా చిత్రీకరించి , అందరిని నమ్మించాడు. పోలీసుల విచారణ లో ఇప్పుడు అసలు నిజాలు బయటపడ్డాయి . ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సులేమాన్, సిరాజ్ ఇద్దరు అన్నదమ్ములు. యాచారం మండలంలోని మేడిపల్లి గ్రామ శివారు లో ఓ పౌల్ట్రీ ఫామ్ లో పనిచేస్తున్నారు.

వారిద్దరూ ఉత్తర ప్రదేశ్ లోని కేమాపూర్ అంబెడ్కర్ నగర్ కు చెందిన వారు . జీవనం కొరకు యాచారం మండలంలోని SR హాట్చరీస్ పాల్ట్రీ ఫామ్ లోని పని చేసేవారు. అయితే ఓ రోజు అన్న సిరాజ్ ను నీళ్లు తీసుకొని రమ్మని తమ్ముడు సులేమాన్ చెప్పాడు. ఇదే విషయమై ఇద్దరి మాట మాట పెరిగి పెద్దదిగా మారింది. సిరాజ్ తల పై తమ్ముడు సులేమాన్ పారతో కొట్టాడు. తలకు తీవ్రమైన గాయం కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా సిరాజ్ మరణించాడు.

ఈ విషయాన్ని తెలివిగా సులేమాన్ తన అన్న వ్యాయామం చేసే డంబల్స్ మీదపడి చనిపోయాడని కట్టుకథ లు అల్లి పౌల్ట్రీ ఫామ్ లో ఉన్న వారందరిని నమ్మించాడు. ఈ విషయం పై దర్యాప్తు చేసిన పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా సులేమాన్ తన అన్నను పార తో కొట్టి చంపడాని నిరూపితమైంది. కాగా ఈ రోజు నిందితుడిని ఎల్ బి నగర్ లోని కోర్ట్ లో ప్రవేశపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement