Thursday, November 21, 2024

యువతికి కరోనా…. ఊరవతల పొలంలో క్వారంటైన్ – ఇదే గ్రామ పెద్దల తీర్పు

టెక్నాలజీ పెరుగుతోంది. ఎన్నెన్నో సాధిస్తున్నాం. అయినా కొంత మందిలో మార్పు మాత్రం రావట్లేదు. కాగా తాజాగా కరోనా సోకిందని ఓ యువతిని పొలంలో ఉండాలని తీర్మానించారు గ్రామస్తులు. దీంతో కుటుంబ సభ్యులు కూడా చేసేదిలేక ఆమెకు తోడుగా పొలం లోనే ఉంటున్నారు. వివరాల్లోకి వెళ్తే….కరోనా సోకిందని ఓ యువతిని గ్రామస్థుల తీర్మానం మేరకు ఊరు అవతల పొలం లో షెడ్ వేసి ఐసోలేషన్ ఏర్పాటు చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా లో చోటుచేసుకుంది.

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం తేజాపూర్‌ పంచాయతీ పరిధిలోని సాలేగూడకు చెందిన మడావి సోన్‌దేవి గురుకులంలో ఇంటర్‌ చదువుతుంది. కాగా ఇటీవల కరోనా బారిన పడింది. దీంతో గ్రామానికి వచ్చిన ఆమెను గ్రామస్థులు ఊళ్లోకి రానివ్వలేదు. గత్యంతరం లేక ఊరి చివరన గల తమ పొలంలోనే ఆమె కుటుంబ సభ్యులు ఐసొలేషన్‌ ఏర్పాటు చేశారు. గ్రామంలోకి బాలికను అనుమతించాలని స్థానిక అధికారులు చెప్పిన గ్రామ పెద్దలు ఒప్పుకోలేదు. కోవిడ్ సోకిన యువతి గ్రామం లోకి వస్తే ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుందని అందుకే క్వారంటైన్‌ రోజులు పూర్తి అయిన తర్వాత గ్రామంలోకి అడుగు పెట్టనిస్తామని గ్రామస్థులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement