టీ 20ల్లో భారత యంగ్ బౌలర్ అర్షదీప్ సింగ్ కలలో కూడా ఊహించని చెత్త రికార్డు సాధించాడు. భారత క్రికెట్ టీమ్‌లో కీలక బౌలర్‌గా రాణిస్తున్న ఈ యువ ఆటగాడు శ్రీలంకతో జరిగిన రెండో టీ 20 మ్యాచ్‌లో బోల్తాపడ్డాడు. ఏకంగా ఐదు నో బాల్స్ వేసిన బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. అర్షదీప్‌కు తోడుగా మరో ఇద్దరు బౌలర్లు కూడా నో బాల్ వేయడం వల్ల ఒకే మ్యాచ్‌లో ఏకంగా ఏడు నో బాల్స్ వేసిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఇప్పటివరకు 11 ఇన్నింగ్స్‌లు ఆడిన అర్షదీప్ ఖాతాలో 14 నో బాల్స్ ఉన్నాయి.
ఇక.. నో బాల్స్ వేసిన రికార్డుల్లో ఇప్పటికే పాకిస్థాన్ బౌలర్ హసన్ అలీ రెండో స్థానంలో ఉన్నాడు. హసన్ 9 ఇన్నింగ్స్‌లో 11 నో బాల్స్ వేశాడు. టీ 20ల్లో ఆరు ఇన్నింగ్స్‌లు ఆడిన వెస్టిండీస్ బౌలర్ కీమో పాల్ ఖాతాలో 11 నో బాల్స్ ఉన్నాయి. అదే జట్టుకు చెందిన మరో బౌలర్ ఒషానే ధామస్ కూడా 11 నో బాల్స్ వేశాడు. జనవరి 5న శ్రీలంకతో పూణేలో జరిగిన రెండో టీ 20లో అర్షదీప్ ఏకంగా 5 నో బాల్స్ వేశాడు. తొలి ఓవర్‌లో మూడు, ఆఖరి ఓవర్‌లో రెండు నో బాల్స్ వేశాడు. దాంతో ఒక ఇన్నింగ్స్‌లో ఎక్కువ నో బాల్స్ వేసిన భారత బౌలర్‌గా నిలిచిపోయాడు. కాగా, అత్యధిక నో బాల్స్ వేసిన జట్టుగా ఘనా నిలిచింది. ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో ఘనా బౌలర్లు ఏకంగా 10 నో బాల్స్ వేశారు.
నో బాల్ వేయని కపిల్ దేవ్..
అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ కాలం ఆడి, ఒక్క నో బాల్ కూడా వేయని బౌలర్లు కొందరున్నారు. వీళ్లలో భారత మాజీ క్రికెటర్ 1983 ప్రపంచకప్ హీరో కపిల్ దేవ్ ఉన్నాడు. అతను 131 టెస్టులు , 225 వన్డేలు ఆడాడు. 79 టెస్టులు, 3 వన్డేలు ఆడిన వెస్టిండీస్ లెజెండరీ స్పిన్నర్ లాన్సే గిబ్స్ తన కెరీర్‌లో ఒక్క నో బాల్ కూడా వేయలేదు. ఇంగ్లండ్ మాజీ ఆల్ రౌండర్ ఇయాన్ బోథాం తన 16 ఏళ్ల కెరీర్‌లో అస్సలు నో బాల్స్ వేయలేదు. 70 టెస్టులు, 63 వన్డేలు ఆడిన ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లి ఖాతాలో నో బాల్ అనేది లేదు. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఇమ్రాన్ ఖాన్ 88 టెస్టులు, 175 వన్డేల్లో నో బాల్ వేయలేదు.