Friday, September 13, 2024

Astrologer | వేణుస్వామికి పంచ్ ప‌డింది !!

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు పంపింది. తాజాగా ఆయన వివాదాస్పద వీడియోపై కమిషన్ నోటీసులు జారీ చేసింది. నాగ చైతన్య, శోభిత ధూళిపాళల నిశ్చితార్థం తర్వాత వేణుస్వామి వారి జాతకాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. నాగ చైతన్య, శోభిత ఇద్దరూ విడిపోతారని వేణుస్వామి అన్నారు. పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

ఇక తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొంతమంది జర్నలిస్టులు.. వేణుస్వామిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వేణుస్వామిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌ను కోరారు. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement