Thursday, November 21, 2024

ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. ప్ర‌భుత్వం త‌ర‌పున‌ పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం ఘనంగా జరిగింది. మంగళవారం ఆలయం ముందు నిర్మించిన భారీ షెడ్డు క్రింద వేదపండితుల మంత్రోచ్ఛారణలతో అమ్మవారి కల్యాణం నిర్వహంచారు. అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్త్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆలయ పరిసరాలు మొత్తం జనసంద్రంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ దంపతులు అమ్మవారి కల్యాణంలో పాల్గొన్న అనంతరం ఆలయం లోపల అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహంచారు.

అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీ క్యూలైన్‌లలో నిల్చున్నారు. ఆలయం పక్కన నూతనంగా నిర్మించిన షెడ్డులో కూడా భక్తులు కూర్చొని అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించారు. భక్తులు అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించేలా ఎల్‌ఈడీ స్క్రన్‌లను ఏర్పాటు చేశారు. అమ్మవారి కళ్యాణంలో టీఎస్‌ఎంఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత, ఎంపీ కవిత, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇంచార్జి తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ దంపతులు, దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, ఈవో అన్నపూర్ణ, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement