Friday, November 22, 2024

నాగార్జునసాగర్‌లో 554కు చేరుకున్న నీటి మ‌ట్టం.. శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తున్న‌ వరద..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ నాగార్జునసాగర్‌కు మోస్తారు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 20, 852 క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి 2367 క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా… ప్రస్తుతం 554.90 అడుగుల వద్ద నీటి మట్టం ఉంది. ఇక సాగర్‌ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 312.40 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 220. 70 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు మరోమారు వరద పోటెత్తుతోంది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి 87852 క్యూసెక్కుల వరద వస్తుండగా… 41, 358క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 879.20 అడుగుల నీరు నిల్వ ఉంది. ఇక జూరాల నుంచి 22, 162 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 84, 588 క్యూసెక్కుల వరద వస్తోంది. ఎగువన అలమట్టి నుంచి 18వేలు, నారాయణపూర్‌ రిజర్వాయర్‌ నుంచి 30వేలు, తుంగభద్ర నుంచి 44వేల క్యూసెక్కుల వరద శ్రీశైలం రిజర్వాయర్‌కు వైపు వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌ పూర్తిగా నిండడంతో ఆ వరద ను నాగార్జునసాగర్‌కు విడుదల చేయనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement