భద్రాచలం వద్ద గోదావరి వరద ఇవాళ ఉదయం 9గంటలకు 50.50లకు అడుగులకు చేరినట్లు జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అల తెలిపారు. రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉన్నట్లు చెప్పారు. రహదారులపైకి వరద నీరు చేరిన ప్రాంతాలతో పాటు పొంగుతున్న వాగులు దాటకుండా బారికేడింగ్ చేసినట్లు చెప్పారు.
వరద ఉధృతి కొనసాగుతున్నదని, అలాగే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి పొర్లు తున్నాయని, ప్రజలు పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంతవరకు ప్రయాణాలను వాయిదా వేసుకుని ఇంటి వద్దనే ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నది నుండి 12,86,136 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ డా ప్రియాంక అల తెలిపారు.