Saturday, November 23, 2024

శభాష్… పెళ్లి కోసం గ్రామానికి రోడ్లు వేసుకున్న గ్రామస్థులు

ఎవరో వస్తారు… ఏదో చేస్తారు… అనుకోకుండా ఆ గ్రామస్థులందరు కలిసి ఒక మాట మీద నిలబడి గ్రామానికి రోడ్డు వేసుకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లా లో చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం గిరిజాయి గ్రామానికి చెందిన హన్మంత్ అనే యువకుడి వివాహం ఆదిలాబాద్ మండలం బండ్లగూడా కు చెందిన మాడవి లక్ష్మీ తో నిశ్చయమైంది. అయితే గిరిజాయి గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో వధువు కుటుంభ సభ్యులు పెండ్లి ని అమ్మాయి ఇంటివద్దే చెయ్యాలని కోరారు.

దీనితో ఆ గూడెం వాసులందరు ఏకమై ఆ శుభకార్యం తమ గ్రామంలొనే జరగాలని ఆ గ్రామానికి వచ్చే రోడ్డును గ్రామస్థులందరు నడుము బిగించి…. బాగు చేసుకున్నారు. వధువు బంధువుల వాహనాలు వచ్చే విధంగా రోడ్డు మరమ్మత్తు చేసుకోవడం తో ఆ గ్రామ యువకుని పెండ్లి గ్రామంలొనే సందడి గా జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement