వన్డే ప్రపంచకప్ 2027కు వేదికలు ఖరారయ్యాయి. అక్టోబర్ & నవంబర్ నెలల్లో జరగనున్న ఈ మెగా టోర్నమెంట్‌కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ప్రస్తుతానికి, దక్షిణాఫ్రికాలో జరగబోయే మ్యాచ్‌లకు వేదికలు ఖరారు అయ్యాయి.
దక్షిణాఫ్రికాలో 11 ఐసీసీ గుర్తింపు పొందిన మైదానాలు ఉండగా, వాటిలో ఎనిమిదింట ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. హోటల్స్, ఎయిర్‌పోర్ట్‌లు, స్టేడియం కెపాసిటీ తదితర అంశాలు పరిగణలోకి తీసుకున్న అనంతరం ఈ ఎనిమిది వేదికలను వరల్డ్‌కప్ మ్యాచ్‌ల కోసం ఎంపిక చేసినట్లు క్రికెట్ సౌతాఫ్రికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫోలెట్సీ మోసెకీ తెలిపారు. జింబాబ్వే నమీబియాలో జరుగబోయే మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలు త్వరలోనే ఖరారుకానున్నాయి.
2027 వన్డే ప్రపంచకప్ కు దక్షిణాఫ్రికాలో ఆతిథ్యమివ్వనున్న మైదానాలు..
- వేదికలు వాండరర్స్.
- ప్రిటోరియాలోని సెంచూరియన్ పార్క్.
- కింగ్స్‌మీడ్.
- గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్
- పార్ల్‌లోని బోలాండ్ పార్క్.
- న్యూలాండ్స్.
- బ్లూమ్‌ఫోంటైన్‌లోని మాంగాంగ్ ఓవల్.
- తూర్పు లండన్‌లోని బఫెలో పార్క్.
- బెనోని, జేబీ మార్క్స్ ఓవల్, డైమండ్ ఓవల్ మైదానాల్లో వసతులు సక్రమంగా లేనందుకు వాటిని పక్కకు పెట్టారు.