Friday, November 22, 2024

భారీగా తగ్గిన ట్విటర్‌ విలువ

గత సంవత్సరం కార్పొరేట్‌ రంగంలో అత్యంత సంచలన అంశాల్లో ట్విటర్‌ కొనుగోలు ఒకటి. టెస్లా అధినేత ప్రపంచ కుబేరుడిగా ఉన్న ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ట్విటర్‌ విలువ మూడో వంతుకు పడిపోయిందని ప్రముఖ ఆర్ధిక సంస్థ ఫిలిడెలిటీ తెలిపింది. ఈ సంస్థకు కూడా ట్విటర్‌లో వాటాలు ఉన్నాయి. చాలా సందర్బాల్లో ఎలాన్‌ మస్క్‌ కూడా తాను ట్విటర్‌ను ఎక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు అంగీకరించారు. ట్విటర్‌ విలువ తాను కొన్న దాంట్లో సగం కూడా ఉందని ఇక సందర్భంగా మాట్లాడుతూ మస్క్‌ చెప్పారు.

- Advertisement -

ట్విటర్‌లో ఉన్న ఫిడిలిటీ వాటాలను కొన్న ధరలతో పోల్చితే 44 శాతానికి తగ్గించింది. డిసెంబర్‌, ఫిబ్రవరిలో వాటాల విలువ మరింత తగ్గినట్లు తెలిపింది. మస్క్‌ ట్విటర్‌ను కొనుగులు చేసే నాటికే కంపెనీ ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉంది. మస్క్‌ కొనుగోలు చేసిన తరువాత ట్విటర్‌ ఆర్ధిక ఇబ్బందులు మరింత పెరిగాయి. చాలా కంపెనీలు ట్విటర్‌కు యాడ్స్‌ ఇవ్వడం మానేశాయి. దీంతో యాడ్స్‌ ద్వారా వచ్చే ఆదాయం 50 శాతం పడిపోయిందని మస్క్‌ కూడా తెలిపారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆయన అనేక మార్పులు చేశారు. ట్విటర్‌ కొనుగోలుకు మస్క్‌ స్వయంగా 25 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు. ఆ పెట్టుబడి విలువ ఇప్పుడు 8.8 బిలియన్‌ డాలర్లుకు తగ్గినట్లు ఫిడెలిటి తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement