రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్‌లో పౌర మరణాలు అంతకంతకు పెరుగుతున్నాయి. మార్చి 18 నాటికి సుమారు 847 మంది పౌరులు మృతిచెందారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. మరో 1399 మంది గాయపడ్డారని ఐరాస మానవ#హక్కుల కార్యాలయం తెలిపింది. రాకెట్ దాడుల, క్షిపణి దాడులు, ఎయిర్ స్ట్రైక్స్ వల్లే ఎక్కువ మంది చనిపోయారని పేర్కొన్నది. కాగా, వాస్తవ సంఖ్య భారీగా ఉంటుందని అధికారులు తెలిపారు. యుద్ధ ప్రభావం ఎక్కువగా ఉన్న పట్టణాలకు సిబ్బంది వెల్లలేకపోయారని, బాధితుల సంఖ్యను లెక్కించడం కష్టంగా మారిందని చెప్పారు. దీంతో యుద్ధ బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. కాగా, ఉక్రెయిన్‌లో రష్యా దాడుల వల్ల ఇప్పటివరకు 112 మంది పిల్లలు మృతి చెందినట్లు స్థానిక ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం వెల్లడించింది. మరో 140 మంది గాయపడినట్లు తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement