Tuesday, November 26, 2024

ఆ మాత్రం ఉంటే ఇక మినీ లాక్ డౌనే !!

కరోనా సెకండ్ వేవ్ లో నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. కరోనా రోగులు హాస్పిటల్స్ వద్ద క్యూ కడుతున్నారు. దీంతో ఆస్పత్రులపై, డాక్టర్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపధ్యంలోనే ఆదివారం అర్ధరాత్రి సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని రాష్ట్రాలకు కొన్ని కీలక సూచనలు మార్గదర్శకాలను జారీ చేసింది. వారం రోజుల వ్యవధిలో 10శాతం పాజిటివిటి, ఆస్పత్రిలో 60 శాతం ఆక్సిజన్ ఐసీయూ భర్తీ మించిన ప్రాంతాల్లో మినీ లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని కేంద్రం సూచించింది.

పాజిటివిటి 10 శాతం దాటిన ప్రాంతాలను విభజించి కఠినంగా ఆంక్షలు అమలు చేయాలని… ఆ ప్రాంతాల్లో రాత్రి ఖర్చులతో పాటు, మరి కొన్ని విషయాలలో కూడా ఆంక్షలు విధించాలని ఆదేశాలను జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement