Tuesday, November 19, 2024

యూకే సర్కార్‌ నైపుణ్యానికే ప్రాధాన్యం.. సరికొత్త వీసా విధానం..

యూకే ప్రభుతం సరికొత్త వీసా విధానాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధం అవుతున్నది. మే 30న దీన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. అయితే ఈ వీసా అన్ని కేటగిరీల కంటే భిన్నంగా ఉంటుందని యూకే ప్రభుత్వం వెల్లడించింది. నైపుణ్యం కలిగిన విదేశీయుల కోసం ఈ వీసా విధానం తీసుకొస్తున్నట్టు తెలిపింది. నైపుణ్యం ఉన్న గ్రాడ్యుయేట్లు మాత్రమే దీనికి అర్హులు అని వివరించింది. ఈ వీసాకు అర్హులైన వారు.. యూకేలోనే ఉంటూ.. ఉద్యోగం చేసుకోవచ్చు. రెండు లేదా మూడేళ్ల పాటు ఈ అవకాశం ఉంటుంది. అయితే నివాస కాలం మాత్రం చదువుకు సంబంధించిన డిగ్రీ స్థాయిని బట్టి నిర్ణయిస్తారు. దరఖాస్తులుకు జాబ్‌ ఆఫర్‌ లేదా స్పాన్సర్‌షిప్‌ అవసరం లేదు. ఈ వీసా ఉన్నవారు యూకే వచ్చి పని చేయడానికి, ఉపాధి, వాలంటీర్‌గా సెట్‌ అవడానికి ఉపయోగకరంగా ఉండనుంది.

వీసా విధానం సులభతరం..

నైపుణ్యం ఉన్న విదేశీయులు యూకే వచ్చి ఉద్యోగం చేసుకునేందుకు గాను వీసా విధానం మరింత సులభతరం చేస్తున్నట్టు సేఫ్‌ అండ్‌ లీగల్‌ మైగ్రేషన్‌ మంత్రి కెవిన్‌ ఫోస్టర్‌ తెలిపారు. యూకే బ్యాచిలర్‌ డిగ్రీకి సమానంగా ఉండాలి. ఎక్కువ అయినా పర్వాలేదని, కానీ తక్కువ ఉండొద్దన్నారు. మీ డిగ్రీ ఇంగ్లీష్‌ మీడియంతో కూడి ఉండాలని, లేనిపక్షంలో ఆంగ్ల భాషా పరీక్షలో కనీసం బీ1 లెవల్‌ ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందన్నారు. వీసా పొందాలంటే.. బ్యాంకు అకౌంట్‌లో కనీసం 1207 పౌండ్స్‌కు సమానమైన బ్యాలెన్స్‌ ఉండాలి. వీసా అప్లికేషన్‌ కంటే నెల రోజుల ముందు నుంచి ఈ మొత్తం ఉండాలని వివరించారు. 12 నెలల కంటే ఎక్కువ కాలం యూకేలో నివాసం ఉండటానికి ఇష్టపడితే.. ఎలాంటి బ్యాంకు బ్యాలెన్స్‌ చూపించాల్సిన అవసరం లేదన్నారు. వీసా ఖరీదు 715 పౌండ్లు అని, గ్రాడ్యుయేట్స్‌, బ్యాచిలర్‌ డిగ్రీ లేదా మాస్టర్స్‌లో డిగ్రీ ఉన్నవారు రెండేళ్ల వీసా ఇస్తామని, పీహెచ్‌డీ లేదా డాక్టరేట్‌ స్థాయి గ్రాడ్యుయేట్స్‌కు మూడేళ్ల కాలపరిమితి వీసా ఇస్తామని వివరించారు. ఈ వీసా ఒక్కసారి మాత్రమే మంజూరు చేయబడుతుందని, ఇప్పటికే గ్రాడ్యుయేట్‌ వీసా కలిగిన వారు దీనికి అనర్హులని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement