పుదుచ్చేరి : రెండో యూత్ వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై 9 వికెట్ల తేడాతో ఇండియా అండర్-19 జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బ్యాటింగ్ చేయగా 49.3 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. అడిసన్ షెరిఫ్ 39, క్రిస్టియన్ హొవే 28, అలెక్స్ లీ యంగ్ 19, జాక్ కర్టన్ 17, లిన్‌కాన్ హొబ్స్ 16, రిలే కింగ్సెల్ 15,ఒలివర్ పీక్ 15 పరుగులు చేయగా, మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
ఇండియా బౌలర్లలో సమర్థ్ నాగరాజ్, మొహమద్ ఇనాన్, కిరన్ చోర్మలె రెండేసి వికెట్లు పడగొట్టారు. 177 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి భారత అండర్-19 జట్టు ఓపెనర్ సహిల్ పరాఖ్ సెంచరీ (109నాటౌట్)తో రాణించగా, వన్‌డౌన్‌లో వచ్చిన అభిగ్యాన్ కుండు హాఫ్ సెంచరీ (53 నాటౌట్)తో రాణించారు.
దీంతో 22 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 177 పరుగులు చేసి 9 వికెట్ల తేడాతో విజయం సాధించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సహిల్ పరాఖ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక 26వ తేదీ నుంచి ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది.