Saturday, November 23, 2024

బొమ్మ‌ని అద్భుతంగా గీయ‌డ‌మంటే.. ప్రాణం పోయ‌డ‌మే : మంత్రి ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావు

బొమ్మని అద్భుతంగా గీయడమంటే ఆ బొమ్మకు ప్రాణం పోయడమే అని రాష్ట్ర పంచాయ‌తీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావు అన్నారు. ర‌వీంద్ర భార‌తిలో గోపాల్ రెడ్డి, సురేంద‌ర్ లు నిర్వ‌హిస్తున్న శిల్పకళా ప్రదర్శనను ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ర‌మ‌ణాచారితో క‌లిసి మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా శిల్ప‌క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌ను ప‌రిశీలించారు. శిల్ప‌క‌ళాకృతుల‌ను చూసి, క‌ళాకారులు గోపాల్ రెడ్డి, సురేంద‌ర్ ల‌ను అభినందించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బొమ్మ‌ను చేసి, ప్రాణం పోసే అద్భుత శిల్ప క‌ళాకారులు గోపాల్ రెడ్డి, సురేంద‌ర్ లు బొమ్మ‌ని అద్భుతంగా గీయ‌డ‌మంంటే… ప్రాణం పోయ‌డ‌మే అన్నారు. ఈ శిల్ప క‌ళ‌ను చాలా త‌క్కువ మంది అనుస‌రిస్తారు.. అందులో చాలా ఏళ్ళ క్రిత‌మే ఈ క‌ళ‌లో ఆరితేరిన వారు మ‌ర్రి గోపాల్ రెడ్డి అన్నారు. మ‌ర్రి గోపాల్ రెడ్డిని చూస్తూ, ఆ క‌ళ‌ని నేర్చుకున్న వారు క‌నుకుల సురేంద‌ర్, ఈ ఇద్ద‌రు ఉపాధ్యాయ వృత్తి నుంచి వ‌చ్చిన వారే అన్నారు. గోపాల్ రెడ్డి తండ్రి రామ్ రెడ్డి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు అని, ఆయ‌న మా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం దేవ‌ర‌ప్పుల‌కు చెందిన వారు కావ‌డం మాకు గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత శిల్ప‌క‌ళాకారుల‌కు ప్ర‌త్యేక గుర్తింపు వ‌చ్చింద‌న్నారు. సీఎం కెసిఆర్ కళల పట్ల మమకారం తో ఉన్నారు. అన్నీ తెలిసిన సీఎం ఆధ్వర్యంలోనే తెలంగాణకు తగిన గుర్తింపు, గౌరవం దక్కుతున్నాయి అన్నారు. ఈ ఎగ్జిబిషన్ పెట్టి మంచి ప‌ని చేశారు, ఇలాంటి ఎగ్జిబిషన్ ల ద్వారా కొత్తగా కావాలనుకునే కళాకారులకు ఉత్సాహంగా, ప్రోత్సాహంగా ఉండ‌నుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా శిల్ప క‌ళా కారులు గోపాల్ రెడ్డి, సురేంద‌ర్ ల‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్ట‌ర్ మామిడి హ‌రి కృష్ణ‌, దైవ‌జ్ఞ‌శ‌ర్మ‌, క‌ళాకారులు గోపాల్ రెడ్డి, సురేంద‌ర్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement