Friday, November 22, 2024

Delhi: మోడీ ప్ర‌మాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

ముచ్చ‌ట‌గా మూడోసారి ఎన్డీఎ కూట‌మి విజ‌యం
రేపు ఎన్డీఏ కూట‌మి నాయ‌కుడి ఎన్నిక‌
ఎనిమిదిన ప్ర‌ధానిగా మోడీ ప‌ద‌వీ బాధ్య‌త‌లు

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీయే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే ఈసారి బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. కానీ ఎన్డీయే 292 సీట్లు గెలుచుకుంది. దీంతో కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కానుంది. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును కూడా మోడీ సమం చేయ‌నున్నారు..

ఇక మోడీ మూడోసారి ప్ర‌ధానిగా ప‌ద‌వీ ప్రమాణం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఈనెల 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, నేడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు సమావేశం ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగింది. ఈ భేటిలోనే ప్ర‌ధాన ప‌ద‌వీ ప్ర‌మాణ తేదీని నిర్ణ‌యించారు.. మోడీ ఇవాళ‌ ప్ర‌ధాని త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

రేపు బీజేపీ ఎంపీలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల సమావేశం జర‌గ‌నుంది. ఈ సమావేశంలో ఎన్డీఏ అధికారికంగా నాయకుడి ఎన్నిక జరుగుతుంది. అనంత‌రం జూన్ 8న బీజేపీ నేతృత్వంలో కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement