Sunday, November 17, 2024

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 4న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఆగస్టు 4న సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ప్రారంభ తేదీ దగ్గరపడుతుండటంతో పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణ పనులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈమేరకు గురువారం పరిశీలించారు. ప్రారంభోత్సవ అలంకరణ ప్రత్యేక ఆకర్షణీయంగా ఉండేలా చూడాలని అధికారులకు మంత్రి సూచించారు. ఆగస్టు 4న ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను కలియతిరగనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ అందుబాటులోకి వచ్చాక 14వ అంతస్తు నుంచి హైదరాబాద్‌ నగరాన్ని సందర్శకులు వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.

గొప్ప చారిత్రాత్మకమైన కట్టడంగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిలిచిపోనుందని, ఈ నిర్మాణంలో తనను భాగస్వామ్యం చేసిన సీఎం కేసీఆర్‌కు మంత్రి వేముల ధన్యవాదాలు తెలిపారు. మెయిన్‌ ఎంట్రెన్స్‌, పోర్టికో, గ్రాండ్‌ ఎంట్రీ, మ్యూజియం, ఆడిటోరియం పనులను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. మిగిలిన ఫినిషింగ్‌ పనులు మ్యాన్‌ పవర్‌ పెంచి ప్రారంభోత్సవంలోపు పూర్తి చేయాలని అధికారులను, వర్క్‌ ఏజెన్సీని మంత్రి ఆదేశించారు. మంత్రి వెంట డిజిపి మహేందర్‌ రెడ్డి, నగర సిపి సి.వి.ఆనందర్‌, ఆర్‌అండ్‌బి ఈఎన్సీ గణపతి రెడడ్‌, ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కౌశిక్‌ రెడ్డి పలువురు ఆర్‌అండ్‌బి, పోలీస్‌ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement