Friday, November 15, 2024

మంకీపాక్స మూడో కేసు నవెూదు..

కేరళలో మరో మంకీపాక్స్‌ కేసు నమోదయింది. దీంతో, మొత్తం కేరళలో నమోదైన మంకీపాక్స్‌ కేసుల సంఖ్య మూడుకు చేరింది. ఈనెల 6వ తేదీన అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి వచ్చిన ముప్పై ఐదేళ్ల వ్యక్తికి మంకీపాక్స్‌ నిర్ధారించడం జరిగిందని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ శుక్రవారం తిరువనంతపురంలో ప్రకటించారు. అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి వచ్చిన వ్యక్తి ఈనెల 13 నుంచి జ్వరంతో పాటు మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించాయని,

దీంతో 15వ తేదీన మంజేరి మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రిలో చేర్పించి పరీక్షలు నిర్వహించగా, డాక్టర్లు మంకీపాక్స్‌ ను నిర్థారించారని మంత్రి వెల్లడించారు. ఆ వ్యక్తిని కలిసిన వారు ఐసోలేషన్‌లో ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు.కేరళలో నమోదైన మూడు మంకీపాక్స్‌ కేసుల్లో ఇద్దరు యూఏఈ, ఒకరు దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తులు కావడం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement