Wednesday, November 20, 2024

TS | రేప‌టితో ముగియనున్న వీసీల పదవీకాలం.. కొత్త వారి నియామకం కోసం సెర్చ్‌ కమిటీ కసరత్తు

రాష్ట్రంలో ఉన్న 10 విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్ల పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. వీసీల నియామకాలకు ఎన్నికల కమిషన్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో కొత్త వీసీల నియామకానికై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే , ఒక్క కాకతీయ విశ్వవిద్యాలయం తప్ప మిగతా 9 విశ్వవిద్యాలయాల ఉప కులపతుల నియామకాల కోసం సెర్‌ ్చ కమిటీని ప్రభుత్వం నియమించింది.

గత ప్రభుత్వం సామాజిక న్యాయానికి తిలోదకాలు ఇచ్చిందనీ, తమ ప్రభుత్వం మాత్రం సామాజిక న్యాయం నేపథ్యంగా నియామకాలు చేపడుతుందని ముఖ్యమంత్రి ఎ రేవంత్‌ రెడ్డి ఇప్పటికే ప్రకటించినందున ఆ దిశలోనే కొత్త వీసీల నియామకం కోసం చర్యలు మొదలయ్యాయి. ఈ నెలాఖరుకు నియామక ప్ర క్రియ పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

కాకతీయ యూనివర్సిటీ మినహా మిగతా ఉస్మానియా , జేఎన్టీయూహెచ్‌, పాలమూరు, పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, జవహర్‌ లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలకు వీసీల నియామకం చేపట్టాల్సి ఉంది. కాకతీయ యూనివర్సిటీ వీసీ నియామకం కోసం ఇంకా సెర్చ్‌ కమిటీని నియమించలేదు.

ప్రస్తుతం వీసీలుగా ఉన్న కొందరిపై పలు రకాల ఆరోపణలు రావడంతో పాటు , బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హాయాంలో నియమితులైనందున కొత్త వారి ఎంపిక పైనే ప్రభుత్వం దృష్టి సారించింది. విశ్వవిద్యాలయాలకు ప్రత్యేక చట్టం ఉండడంతో కొన్ని వి షయాల్లో ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోలేని అధికారాలు ఉండడంతో వీసీ పదవులకు మంచి క్రేజ్‌ ఉంటుంది. అందుకే వీసీలుగా పని చేసేందుకు ప్రొఫెసర్లు పోటీ పడతారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం, జేఎన్జీయూ హెచ్‌ విశ్వవిద్యాలయాల వీసీలుగా పని చేసేందుకు ఎక్కువ మంది అసక్తి చూపుతారు. వీసీల నియామకానికి ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ మేరకు సిట్టింగ్‌ వీసీలతో పాటు కొత్త వారు కూడా మొత్తం 312 మంది ప్రొఫెసర్లు తమ దరఖాస్తులను ప్రభుత్వానికి సమర్పించారని తెలిసింది. అంతేగాక , తమ పేర్లను సిఫార్సు చేయాలని అభ్యర్థిస్తూ మంత్రులు. అధికార పార్టీకి చెందిన నేతలపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.

- Advertisement -

తమ జిల్లా ల పరిధిలో ఉన్న విశ్వవిద్యాలయాల పరిధిలో తమ వారినే నియమించుకోవాలనే ఆసక్తితో పలువురు కాంగ్రెస్‌ ముఖ్యులు, మంత్రులు సీఎం దృషికి తెచ్చారని చెబుతున్నారు. కొత్త వీసీల నియామకం కోసం ప్రభుత్వం నియమించిన సెర్చ్‌ కమిటీలు కసరత్తు మొదలుబెట్టాయి.

వీలైనంత త్వరలో ఈ కమిటీ ముగ్గురి పేర్లతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. కమిటీ ఇచ్చిన నివేదికలను ప్రభుత్వం గవర్నర్‌కు పంపిస్తుంది. గవర్నర్‌ ఒక్క పేరును ఆమోదించి ప్రభుత్వానికి పంపిస్తుంది. అయితే, వీసీల పదవీకాలం ముగుస్తున్నందున పారిపాలనా సౌలభ్యం కోసం ఉన్న వారికే ఇంచార్జీలుగా బాధ్యతలు ఆప్పగిస్తారా ? లేదా ఐఎఎస్‌లను ఇంచార్జీలుగా నియమిస్తారా ? అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ విషయం మంగళవారం తేలే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement