రెండు నెలల పాటు జరిగే మండల మకరవిళక్కు పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలను తెరిచారు.దర్శనాలు మాత్రం శనివారం ఉదయం మొదలవుతాయని, అప్పటి నుంచే మండల పూజల సీజన్ అధికారికంగా మొదలవుతుందని అధికారులు తెలిపారు.
కాగా, భక్తుల రద్దీ దృష్ట్యా దర్శన సమయాన్ని కూడా పెంచారు. రోజుకు 18 గంటల పాటు దర్శనాలు ఉంటాయని టీడీబీ అధికారులు ప్రకటించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు దర్శనం ఉంటుంది.
మండల సీజన్ అధికారికంగా శనివారం నుంచి ప్రారంభమై డిసెంబర్ 26 వరకు కొనసాగుతుంది. డిసెంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే మకరవిళక్కు జనవరి 20, 2025 వరకు కొనసాగుతుంది.