ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తూ.. రూ.వేలకు వేలు ఫీజులు కట్టుకుంటూ హాసళ్లలో, రూముల్లో ఉంటూ.. కోచింగ్ లు తీసుకుంటూప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకళసాకరమయ్యే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నాయి. త్వరలోనే జంబో నోటిఫికేషన్‌ను వెలువరించేందుక సన్నాహాలు చేస్తున్నారు. సాగర్ ఉప ఎన్నిక, ఫలితాల తర్వాత అంటే మే నెల
మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలుస్తోంది. ముందస్తుగా అత్యధిక ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు గుర్తించిన పోలీసు శాఖ నుంచే మొదటి భారీ ఉద్యోగ నోటిఫికషన్ వెలువడే వీలుంది. నిరుద్యోగ యువత కూడా దీనికోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన రంగం సిద్ధమవుతోంది.
పోలీసు, విద్యా, వైద్యారోగ్యశాఖ, రెవెన్యూ, వ్యవసాయ, మునిసిపల్, ఇరిగేషన్, అటవీ శాఖ తదితర శాఖలల్లో దాదాపు 55 వేల నుంచి 60 వేల వరకు ఖాళీలు గుర్తించినట్లు లెక్క తేలడంతో ప్రభుత్వం ఆ దిశగా నియామక ప్రక్రియను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఇందులో 20 వేలకు పైగా ఖాళీలను గుర్తించిన
పోలీసుశాఖనుంచే మొదటి ఉద్యోగ నియామక ప్రకటన జారీవేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసే వారిలో ఎక్కువ మంది నిరుద్యోగ యువత పోలీసు ఉద్యోగాలకే ఎక్కువగా ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఆ తరువాత ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్స్ నోటిఫికేషన్లకు. పోలీసు శాఖ
నుంచి భారీ నోటిఫికేషన్ వేసి ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని తూడ్చేసి తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దీనిపై అధికారిక వర్గాలు ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలుస్తోంది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు 2018 మే 31న మొత్తం 18,428 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో 16,925 కానిస్టేబుల్
పోస్టులు, 1,508 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. 2019 నాటికి వీటికి రాత పరీక్ష పూర్తయి ఫలితాలు వచ్చేశాయి. ఎస్ఏతోపాటు, సివిల్, ఆర్మ్ డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుళ్లకు గతేడాది జనవరి నాటికి శిక్షణ మొదలైంది. కరోనా లా డౌన్, శిక్షణకు మైదానాల కొరత, వసతి కారణంగా తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ శిక్షణలో కాస్త జాప్యం జరిగింది. గతేడాది అక్టోబర్ లోనే 9,218 మంది సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్ల శిక్షణ పూర్తయి విధుల్లో చేరారు. మరో 1162 మంది ఎస్ఏలు కూడా శిక్షణ పూర్తి చేసుకున్నారు.
ఇలా చూసుకుంటే 10,375 పోస్టులు ఇప్పటికే పోలీసు శాఖలో భర్తీ
అయ్యాయి. భర్తీ కాకుండా సరెండర్ చేసిన పోస్టులు కూడా కొన్ని ఉన్నాయి. వీటికి తోడు కొత్తగా ఏర్పడిన ఖాళీలు కలుపుకొని సుమారు 20వేలకు పైగా ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసు, విద్యా, వైద్యారోగ్యశాఖ, అటవీ శాఖ,రెవెన్యూ, ఇరిగేషన్, పురపాలక, వ్యవసాయ, ఇతర శాఖలలో దాదాపు 50వేల
పోస్టుల భర్తీకి సీఎంపచ్చజెండా ఊపడంతో త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఈ నెల 17న జరగనుంది. ఓట్ల లెక్కింపుమే 2నచేపట్టనున్నారు. ఎన్నికల నియమావళి ముగిసి ఫలితం వెలువడిన తరువాతనే ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టే వీలుంది. అయితే దీనికి ముందు ఉద్యోగ నియామకాలపై సీఎం సమావేశం నిర్వహించి ఖాళీలు, వాటి భర్తీ ప్రక్రియ, నియామక సంస్థల ఎంపిక వంటి అంశాలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకుని
ఉద్యోగ నియామకాలపై క్యాబినెట్ ఆమోదం పొందాలి. ఆ తరువాత ఆయా శాఖలకు సన్నద్ధం చేయాల్సి ఉంటుంది.