Tuesday, November 26, 2024

ప్రైవేట్ టీచర్లకు 25 కేజీల బియ్యం,2వేలు – కేసీఆర్

కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలన్నీ మూసివేస్తున్నట్లు తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ స్కూల్స్ కు సంబంధించిన టీచర్లు జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరికొంతమంది ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వమే మమ్మల్ని కాపాడాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .

ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జీతాలు లేక ఇబ్బంది పడుతున్న టీచర్లు, సిబ్బందికి.. నెలకు రూ.2వేలు, 25కిలోల బియ్యం ఇవ్వాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్స్ టీచర్లు, సిబ్బంది బ్యాంక్ అకౌంట్లతో కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ మేర రాష్ట్రంలో లక్షా 45 వేల మంది ప్రైవేట్ టీచర్లకు లబ్ధి చేకూరనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement