Tuesday, November 26, 2024

విద్య, వైద్య రంగాల‌ను ప‌ట్టించుకోని తెలంగాణ‌ ప్ర‌భుత్వం : కోదండ‌రామ్‌

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం విద్య‌, వైద్య రంగాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. సీఎం కేసీఆర్ దేశమంతా తిరుగుతూ.. సమస్తం తామే బాగన్నట్టు ప్రచారం చేస్తున్నారని, బడ్జెట్‌లో అత్యంత కీలకమైన విద్య, వైద్యంపై ఎప్పుడూ తెలంగాణా సర్కారుది శీతకన్నే అన్నారు. విద్యపై బడ్జెట్‌ను అన్ని రాష్ట్రాలు 15% కేటాయిస్తే తెలంగాణ సర్కారు మాత్రం ఏడున్నర శాతం కేటాయిస్తోందన్నారు. వైద్యంలోనూ అదే పరిస్థితి ఉందని తెలిపారు. విద్యకు సంబంధించి ట్రీపుల్ ఐటీయే అందుకు ఓ ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. వైద్యానికి సంబంధించి ఇబ్రహీంపట్నంలో జరిగిన కు.ని ఆపరేషన్ల తీరే మరో ఉదాహరణ అని అన్నారు. ఒక ఆపరేషన్ వికటించిందంటే అర్థం చేసుకోవచ్చు… కానీ నలుగురు కు.ని ఆపరేషన్ల ద్వారా చనిపోవడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికీ వాళ్లలో చాలామంది ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాల్లో పూర్తి నిర్లక్ష్యం వహిస్తోందని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement