Wednesday, November 20, 2024

ప్ర‌పంచంలోనే.. ఎత్త‌యిన రైల్వే వంతెన‌.. ఎక్క‌డుందంటే..

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఎక్క‌డ ఉందో తెలుసా..? దీని కోసం ఏ పుస్త‌కం తెర‌వాల్సిన అవ‌స‌రం లేదు.. నెట్టింట్లో సెర్చ్ చేయాల్సిన అవ‌స‌రం అంత‌కంటే లేదు.. ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన‌ను భార‌త్ నిర్మిస్తోంది. అదెక్క‌డో తెలుసా.. మ‌ణిపూర్‌లోనే అండి.. 141 మీటర్ల ఎత్తులో రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. యూర‌ప్‌లోని మోంటెనెగ్రోల్‌లోని మాలా-రిజెకా వయాడక్ట్‌లో 139 మీటర్ల ఎత్త‌యిన రైల్వే వంతెన ఉంది. ఈ రికార్డును భార‌త్ అధిగమించింది. ఈ ప్రాజెక్టు 111 కిలోమీటర్ల పొడవు జిరిబామ్‌-ఇంఫాల్‌ రైలు మార్గం.

ఇది దేశంలోని బ్రాడ్‌గేజ్‌ నెట్‌వర్క్‌తో నిర్మాణం అవుతోంది. ప్రాజెక్టు పూర్తయితే కేవలం 2-2.5 గంటల్లోనే 111 కిలోమీటర్ల దూరం ప్ర‌యాణించొచ్చు. ప్రస్తుతం జిరిబామ్‌-ఇంఫాల్‌ (NH-37) మధ్య దూరం 220 కిలోమీటర్లు. ఈ ప్ర‌యాణానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టేది. ఎత్త‌యిన రైల్వే నిర్మాణం తర్వాత నోనీ లోయను దాటే వంతెన ప్రపంచంలోనే ఎత్తైన ఫైర్‌ వంతెనగా మారనుంది. ఈ వంతెనను డిసెంబర్‌ 2023 నాటికి పూర్తి అవుతుందని అధికారులు భావిస్తున్నారు.12 కిలోమీటర్ల దూరం విస్తరించే మొదటి దశ పనులు ప్రారంభం అయ్యాయి. రెండో దశలో 98 శాతం పనులను పూర్తి చేయనున్నారు. ఫిబ్రవరి 2022 నాటికి ప్రాజెక్టు పూర్తి కానున్నట్లు, మిగతా పనులు డిసెంబర్‌ 2023 నాటికి పూర్తవుతాయని అన్నారు.

అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. 703 మీటర్ల పొడవులో 9 సపోర్టింగ్‌ పిల్లర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీని తయారీలో 11780 మెట్రిక్‌ టన్నుల ఉక్కును ఉప‌యోగిస్తున్నారు. జిరిబామ్‌ ఇంఫాల్‌ 111 కిలోమీటర్ల పొడవైన మార్గంలో నోని జిల్లాలో నిర్మించే ఈ వంతెన ఎత్తు 141 మీటర్లు. దీని తర్వాత ప్రపంచంలో బెల్ర్గేడ్‌లో ఒక వంతెన నిర్మించబడుతోంది. ఢిల్లీలోని కుతూబ్ మినార్ కంటే రెండింత‌లు ఎత్తుగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement