Saturday, November 23, 2024

ఉదయ్‌పూర్‌ టైలర్‌ మర్డర్‌ కేసు నిందితుడు.. హైదరాబాద్‌లో అరెస్టు చేసిన ఎన్‌ఐఎ అధికారులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దేశంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా వాటి మూలాలు హైదరాబాద్‌లో వెలుగు చూడటం సర్వసాధారణంగా మారింది. తాజాగా మరోసారి అదే విషయాన్ని నిరూపితమైంది. కొద్ది రోజుల రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో టైలర్‌ కన్నయ్యలాల్‌ సాహూను గొంతు కోసి హత్య చేసిన విషయం తెలిసిందే. బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన నుపుర్‌శర్మ ఫొటోను వాట్సప్‌ డీపీగా పెట్టుకోవడంతో పాటు ఆమెకు మద్దతుగా పోస్టింగ్‌ పెట్టినందుకు కొంత మంది టైలర్‌ను గొంతు కోసి హత్య చేశారు.

ఈ హత్యతో సంబంధం ఉన్న నిందితుడు మహ్మద్‌ మనువర్‌ హుసేన్‌ అస్రఫీ (36) ని ఎన్‌ఐఎ పోలీసులు పాతబస్తీలోని సంతోష్‌నగర్‌లో అరెస్టు చేశారు. సంతోష్‌నగర్‌ చౌరస్తాలోని లక్కీ హోటల్‌ సమీపంలో సోదాలు నిర్వహించిన అధికారులు బీహార్‌కు చెందిన యువకుడిని అరెస్టు చేశారు. అతడిని కోర్టులో హాజరు పరచి రాజస్థాన్‌కు తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement