Wednesday, November 20, 2024

judjement : ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఉపవర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ తీర్పు వెల్లడించింది. 2004లో రాష్ట్రప్రభుత్వాలు ఉపవర్గీకరణ చేయొద్దని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును 6:1 మెజారిటీతో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పక్కన పెట్టి తీర్పు వెలువరించింది.

ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంలో జస్టిస్ బేలా త్రివేది మాత్రమే విభేదించగా మిగిలిన ఆరుగురు ఉపవర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్రాలు ఎస్సీ కేటగిరి చేసుకునే వెసులుబాటు కల్పించింది సర్వోన్నత న్యాయస్థానం. ఎస్సీ రిజర్వేషన్లలో క్యాటగిరి చేసుకునే అంశంపై సుప్రీంకోర్టు పంజాబ్ ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎమ్మార్పీఎస్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపైన తాజాగా సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement