Tuesday, November 26, 2024

10, 12వ త‌ర‌గతి బోర్డు ప‌రీక్ష‌ల‌ రద్దుకు సుప్రీం నో..

సీబీఎస్‌ఈ సహా ఇతర బోర్డులు నిర్వహించే 10, 12వ తరగతి ఆఫ్‌లైన్‌ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇలాంటి పిటిషన్లు విద్యార్థుల్లో గందరగోళం సృష్టిస్తాయని, తప్పుడు విశ్వాసం కలగజేస్తాయని న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి ఇంకా తొలగిపోనందుకు 10, 12వ తరగతి బోర్డు ఆఫ్‌లైన్‌ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలైంది. 15 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ వ్యాజ్యాన్ని వేశారు. అందుకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఫలితాలు ప్రకటించేలా సీబీఎస్‌ఈ, ఇతర బోర్డులకు ఆదేశాలివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఖాన్విల్కర్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఈ విధమైన పిటిషన్ల వల్ల విద్యార్థులకు తప్పుడు విశ్వాసాలు కలుగుతాయి. విద్యార్థులను తప్పుదోవ పట్టించేలా ఉన్న ఈ పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నాం. ఇప్పటికే అధికారులు.. ఈ పరీక్షల తుది తేదీలను ప్రకటించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తిచేసేపనిలో ఉన్నారు. ఆ పరీక్ష తేదీలతో ఏమైనా సమస్యలుంటే అప్పుడు పిటిషనర్లు సదరు అధికారులను సంప్రదించొచ్చు. పరీక్షల రద్దు సరికాదు అని ధర్మాసనం స్పష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement