Sunday, November 24, 2024

Big Story: స్మార్ట్‌ఫోన్‌ల స‌ప్ల‌య్ త‌గ్గింది.. అమ్మ‌కాలు కూడా అట్ల‌నే ఉన్న‌య్‌

దేశంలో స్మార్ట్‌ఫోన్‌ సరఫరాలు ఈ ఏడాది జులై-సెప్టెంబర్‌లో 10 శాతం తగ్గాయి. దీంతో అమ్మకాలు మూడేళ్ల కనిష్టామైన 4.3 కోట్లకు పరిమితమయ్యాయని మార్కెట్‌ పరిశోధనా సంస్థ ఐడీసీ వెల్లడిం చింది. 2019 తరువాత ఒక త్రైమాసికంలో నమోదైన అత్యల్ప సరఫరాలు ఇవేనని తెలిపింది. తగ్గిన డిమాండ్‌, అధిక ధరలు పండగ కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం చూపాయని వివరించింది. మొత్తం స్మార్ట్‌ ఫోన్‌లలో 5జీ ఫోన్ల వాటా 36 శాతానికి (1.6 కోట్లు) కు చేరింది. జూన్‌ త్రైమాసికంలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ సగటు ధర 377 డాలర్లు, దాదాపు 30,600గా ఉంది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఇది 393 డాలర్లుగా ఉంది, అంటే దాదాపు 32 వెలుకుపెరిగిందని తెలిపింది.

స్మార్ట్‌ ఫోన్‌ నిల్వలు పెరుకుపోగా, పండుగల తరువాత గీరాకీ సహజంగానే తగ్గుతుంది కనుక డిసెంబర్‌ త్రైమాసికంలోనూ సరఫరాలు స్తబ్దంగా ఉండవచ్చని పేర్కొంది. ఫలితంగా 2022 వార్షిక సరఫరాలు 8-9 శాతం తగ్గి దాదాపు 15 కోట్లుగా నమోదు కావచ్చని ఐడీసీ డివైస్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నవ్కేందర్‌ సింగ్‌ వెల్లడించారు. 2023 లోనూ గిరాకీపై ద్రవ్యోల్బణం ప్రభావం చూపొచ్చని, అధిక ధరల నేపథ్యంలో ఫీచర్‌ ఫోన్ల నుంచి స్మార్ట్‌ ఫోన్లకు మారడం నెమ్మదించవచ్చని అంచనా వేసింది. 4జీ నుంచి 5జీ ఫోన్లకు మారేవారిలో మధ్యశ్రేణి, ఖరీదైన విభాగాలకు కలిసిరావొచ్చని అభిప్రాయపడ్డారు.

- Advertisement -

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌తో పాటు, ఇతర ఇ-కామర్స్‌ సైట్స్‌ ఆఫరతో ఆన్‌లైన్‌ విక్రయాలు బెరుగ్గానే, సంప్రదాయ విక్రయాలు మాత్రం 20 శాతం తగ్గాయని నివేదిక పేర్కొంది. మొత్తం మార్కెట్‌లో మీడియా టెక్‌ చిప్‌ సెట్‌ ఆధారిత స్మార్ట్‌ఫోన్ల వాటా 47 శాతానికి పెరిగింది. క్వాల్‌కామ్‌ 25 శాతానికి, యూనిసాక్‌ 15 శాతానికి తగ్గాయి. షియామీ 21.2 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్తానంలో ఉంది. సరఫరాలు మాత్రం తగ్గాయి. శాంసంగ్‌ 18.5 శాతం వాటాతో రెండో స్థానాన్ని మళ్లి దక్కించుకుంది. వివో 14.6 శాతం, రియల్‌ మీ 14.2 శాతం, ఓప్పో 12.5 శాతం తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రీమియం విభాగంలో యాపిల్‌ 63 శాతంతో అగ్రస్థానంలో ఉంది.

శాంసంగ్‌ 13శాతం తగ్గొచ్చు

వచ్చే ఏడాది శాంసంగ్‌ తమ స్మార్ట్‌ఫోన్‌ సరఫరాలను 13 శాతం తగ్గించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొవిడ్‌ పరిణామాలతో పాటు పలు కారణాల వల్ల ఈ ఏడాది కంపెనీ ఆశించిన స్థాయిలో స్మార్ట్‌ఫోన్లను విక్రయించలేకపోయింది. అందువల్ల వచ్చే ఏడాది స్మార్ట్‌ఫోన్ల సరఫరాలను 13 శాతం తగ్గించి, 3 కోట్లకు పరిమితం చేయవచ్చని అంచనా వేసింది. ఈ ఏడాది జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్‌ త్రైమాసికంలో సరఫరాల పరంగా కంపెనీ మార్కెట్‌ వాటా పెరగలేదు. 2021తో పోలిస్తే మొత్తంగా 8 శాతం క్షిణత నమోదైంది. వచ్చే ఏడాది అంతర్జాతీయంగా శాంసంగ్‌ 27 కోట్ల స్మార్ట్‌ఫోన్లను విక్రయించవచ్చని అంచనా వేస్తున్నారు. 2022లో విక్రయించగలమని భావిస్తున్న 26 కోట్ల స్మార్ట్‌ఫోన్లలతో పోల్చితే ఇవి ఎక్కువే. అయితే లాభదాయకత పెంచుకునేందుకు ఫోల్డబుల్‌ ఫోన్లపై కంపెనీ దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement