Friday, November 22, 2024

గంజాయి స్మగ్లర్ల సూప‌ర్‌ స్కెచ్‌, రాష్ట్రాలు దాటించేందుకు సరికొత్త ప్లాన్‌.. అయినా క‌నిపెట్టిన పోలీసులు

వ‌రంగ‌ల్ క్రైమ్‌, ప్రభన్యూస్‌: అక్రమార్జనకు అలవాటు పడ్డ గంజాయి స్మగ్లర్లు, టన్నుల కొద్ది గంజాయిని రాష్ట్రాల సరిహద్దులు దాటించేందుకు సరికొత్త పథకాలు అవలంభిస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా వందల కిలోల గంజాయిని తరలించే ఏకైక లక్ష్యంతో ఎప్పటికప్పుడు సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. గంజాయి స్మగ్లర్లు స్కెచ్‌లు వేయడంలో ఆరితేరిపోయారని ఈ తాజా ఘటనే రుజువు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ నుండి హైదరాబాద్‌ మీదుగా మహరాష్ట్రకు అక్రమంగా గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్న నలుగురు గంజాయి స్మగ్లర్ల స్కెచ్‌ను ఓరుగల్లు కమిషనరేట్‌ పోలీసులు భగ్నం చేశారు. మూడు రాష్ట్రాల పోలీసులకు ఎటువంటి అనుమానం, మరెలాంటి సందేహం, ఇంకెలాంటి సంశయం రాని రీతిలో 20 లక్షల రూపాయల విలువ జేసే 200 కేజీల గంజాయిని పక్కాగా రాష్ట్రాల సరిహద్దులు దాటిస్తున్నట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పక్కా సమాచారం అందుకొన్నారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు గంజాయి స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్‌, కోడకండ్ల పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్‌ చేశారు.

వీరి నుండి పోలీసులు సుమారు 20 లక్షల విలువగల 200 కిలోల గంజాయి, డోజర్‌ ట్రాక్టర్‌, ఆరు సెల్‌ఫోన్లు, రెండు ప్లాస్టిక్‌ డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్‌ చేసిన నిందితుల్లో జగిత్యాల జిల్లాకు చెందిన సూర్యటి వెంకన్న(ఇతను ప్రస్తుతం విశాఖ జిల్లా ధారకొండలో నివాసం ఉంటున్నాడు), విశాఖ జిల్లా ధారకొండకు చెందిన కొమిరి రాములు, మబూబాబుబాద్‌ జిల్లాకు చెందిన భూక్యా శంకర్‌, బానోత్‌ శ్రీనివాస్‌ ఉన్నారు. ఈ అరెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇంచార్జ్‌, అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) వైభవ్‌ గైక్వాడ్‌ పత్రికలకు విడుదల చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement