భూమిపై జీవం మనుగడకు మూలం సూర్యుడు. సూర్యగోళం నుంచే భూమిపైకి వెలుగుతోపాటు వేడి, సౌరశక్తి ప్రసరిస్తుంది. ఇది భూమిపై వివిధ జీవజాతులు వృద్ధి చెంద డానికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. కానీ భగభగమండే సూర్యుడు తనలోని సౌరశక్తిని పూర్తిగా వెదజల్లి తే ఏం జరుగుతుంది? భూమి మాడిమసైపోతుంది కదా! ఆసక్తికరమైన ఈ అంశంపై శాస్త్రవేత్తల బృందం అధ్యయనం జరిపింది. ఈ అధ్యయన నివేదికను అస్ట్రోఫిజికల్ జర్నల్‌కు పంపారు. ఇప్పటి నుంచి 500 కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడు తన జీవధార శక్తులన్నింటినీ కోల్పోయి, ఎర్రటి దిగ్గజం అవుతాడని శాస్త్రవేత్తలు తమ పరిశోధన నివేదికలో పేర్కొన్నారు. ఈ పరిణామం తర్వాత జరగబోయే గందర గోళం గురించి వివరిస్తూ, భూగ్రహం అవమానకరమైన ముగింపును ఎదుర్కొంటుందని తెలిపారు. భూమితోపాటు బుధుడు, శుక్రుడిని కూడా మండె సూర్యుడు మింగివేస్తాడని పరిశోధకులు పేర్కొన్నారు. సూర్యుడి లాంటి శక్తివంతమైన నక్షత్రం చుట్టుముట్టిన తర్వాత ఒక గ్రహం ఎదుర్కొనే ఫలితా లను అర్థం చేసుకోవడానికి పరిశోధకులు త్రిమితీయ హైడ్రోడై నమిక్ అనుకరణలను ప్రదర్శించారు. చుట్టుముట్టబడివున్న వస్తువు పరిమాణం, నక్షత్రం పరిణామ దశపై ఫలితాలు ఆధారపడివుంటాయని తమ అధ్యయనంలో వారు తేల్చారు. నక్షత్ర వ్యవస్థల జీవిత చక్రంలో గ్రహాలు చిక్కుబడటం అనే ప్రక్రియ సాధారణమని స్పష్టంచేశారు. భూమి విషయానికొస్తే పూర్తిగా మాయమవు తుందా? అనేదానిపై స్పష్టతలేదు.
కానీ, అది జీవించడం మాత్రం అసాధ్యం అవుతుందని కచ్చితంగా చెప్పగలను అని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఖగోళ శాస్త్రంలో గ్రాడ్యుయేట్ విద్యార్థి రికార్డొ యార్టా చెప్పారు. రెడ్ జెయింట్ దశలో సూర్యుడు హైడ్రోజన్‌ను కోల్పోయి నప్పు డు, దాని సరిహద్దు వందల రెట్లు విస్తరిస్తుందని పేర్కొన్నారు. తాజా పరిశోధన అనేక ఇతర ఫలితాలను కూడా అంచనా వేసింది. సూర్యుడి చేత చుట్టుముట్టబడిన గ్రహం కఠినమైన లేదా కొత్త కక్ష్యలోకి నెట్టబడుతుంది. ఇతరులు కొత్త ప్రపంచా న్ని సృష్టించడంలో ఈ పరిణామం సహాయపడొచ్చు. కాగా సూర్యుడు మధ్య వయసుకి చేరుకున్నాడని కొద్దిరోజుల కిందట యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఎ) నివేదిక విడుదల చేసింది. సూర్యుడి ప్రస్తుత వయసు 4.57 బిలియన్ సంవత్సరాలని, తరచుగా ఏర్పడే సౌర మంటలు, కరోనల్ మాస్‌ఎజెక్షన్లు, సౌరతుపాను లతో సూర్యుడు మిడ్‌లైఫ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు ఈ పరిశోధన పేర్కొంది.