Monday, November 18, 2024

ఢిల్లీలో దంచికొడుతున్న ఎండలు..

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఎండలు మండుతున్నాయి. మ‌రికొన్ని రోజుల పాటు ఇలాగే ఉష్టోగ్ర‌త‌లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. సోమ‌వారం రోజు భారీ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. రాజ‌ధాని ఢిల్లీతో పాటు ప‌రిస‌ర ప్రాంతాల్లో 45 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఆదివారం రోజు న‌జ‌ఫ్‌గ‌ర్హ్ ఏరియాలో అత్య‌ధికంగా 46.3 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. భారీ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు అవ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు రావాల‌ని సూచిస్తున్నారు. శనివారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 23.2 డిగ్రీల సెల్సియస్‌గానూ, గరిష్ట ఉష్ణోగ్రత 40.4 డిగ్రీల సెల్సియస్‌గానూ నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement