ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీహార్‌లోని పోలిగంజ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో తమ ఎంపీ అభ్యర్థి లాలూ ప్రసాద్ కుమార్తె మిసాభారతిని గెలిపించాలని ఆకాంక్షించారు. ఆ సమయంలో రాహుల్ గాంధీతో పాటు పలువురు స్థానిక కాంగ్రెస్ నేతలు వేదికపైకి వచ్చారు. ప్రతి ఒక్కరూ తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ రాహుల్ ప్రజలకు అభివాదం చేశారు.
ఈ క్రమంలో ఆయనకు అనుకోని ఘటన ఎదురైంది. వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే అప్రమత్తమైన రాహుల్ గాంధీ.. బ్యాలెన్స్ చేసుకున్నారు. ఆయన భద్రతా సిబ్బంది రాహుల్‌ను కిందపడకుండా కాపాడారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కూడా తమ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ క్షేమంగా ఉన్నారని, ఆయనకు ఏమీ కాలేదని ప్రకటించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.