Tuesday, November 26, 2024

మూడో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 433 పాయింట్లు లాభం

స్టాక్‌ మార్కెట్లు వరసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. అమెరికా, ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియడం, క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గడం వంటి కారణాలతో మార్కెట్లు ఉదయం నుంచి సానుకూలంగా స్పందించాయి. సకాలంలోనే సరైన వర్షాలు కూరుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటనతో మార్కెట్లు పుంజుకున్నాయి. సెన్సెక్స్‌ 433 పాయింట్లు లాభంతో 53161 వద్ద ముగిసింది. నిఫ్టీ 132.80 పాయింట్ల లాభంతో 15832.05 వద్ద ముగిసింది. బంగారం ధర 82 రూపాయిలు పెరిగి 50705 వద్ద ట్రేడ్‌ అయ్యింది. వెండి కేజీ ధర 579 రూపాయిలు పెరిగి 60328 వద్ద ట్రేడ్‌ అయ్యింది. డాలర్‌తో మారకపు విలువ 77.98 రూపాయిలుగా ఉంది.

లాభపడిన షేర్లు

ఎల్‌ అండ్‌ టీ, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, ఏషియా పేయింట్స్‌, ఇండస్‌ల్యాండ్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ ఉన్నాయి.

నష్టపోయిన షేర్లు..

కోటల్‌ మహీంద్రా బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టైటాన్‌, ఐచర్‌ మోటార్స్‌, అపోలో ఆస్పటల్స్‌ ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement