దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మూడు రోజుల వరస నష్టాలకు బ్రేక్ వేస్తూ శుక్రవారం నాడు లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం వరకు అదే బాటలో పయనించాయి. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు పుంజుకున్నాయి. డిసెంబర్‌లో అమెరికా,భారత్‌లో ద్రవ్యోల్బణం తగ్గడం కూడా సూచీల సెంట్‌మెంట్‌ను బలపరిచింది. డాలర్‌తో మన రూపాయి బలపడటం కూడా కలిసి వచ్చింది. మదుపర్లు కొన్ని కీలక షేర్లలో కొనుగోళ్లకు దిగడం కూడా సూచీల లాభపడేందుకు దోహదం చేసింది.
సెన్సెక్స్ 303.15 పాయింట్ల లాభంతో 60261.18 వద్ద ముగిసింది. నిఫ్టీ 98.40 పాయింట్ల లాభంతో 17956.60 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 172 రూపాయలు పరిగి 56047 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 379 రూపాయలు తగ్గి 68264 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 81.65 రూపాయలుగా ఉంది.
లాభపడిన షేర్లు..
టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రా సిమెంట్స్, బజాజ్ ఫైనాన్స్,హిందూస్థాన్ యూనిలీవర్, టీసీఎస్, ఎన్‌టీపీసీ, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, ఎం అండ్ ఎం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఆటో, సిప్లా, ఓఎన్‌జీసీ, డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ షేర్లు లాభపడ్డాయి.
నష్టపోయిన షేర్లు..
టైటాన్ కంపెనీ, నెస్లీ ఇండియా, ఎల్ అండ్ టీ, ఐటీసీ, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, అపోలో ఆస్పటల్స్ షేర్లు నష్టపోయాయి.