ఖమ్మం బ్యూరో : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం తెలంగాణ అమర వీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపాన్ని సందర్శించి పూలతో ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేస్తూ జోహార్లు అర్పించారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జాతీయ జెండాను ఎగురవేసి ప్రసంగించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా దళిత బందు యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. మంత్రి పువ్వాడ వెంట ఎమ్మెల్సీ తాత మధుసూదన్, ఆర్ జే సి కృష్ణ, నగర మేయర్ పు నుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ , జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ , జిల్లా అదనపు డిసిపిలు గౌస్ ఆలం, ఏ సుభాష్ చంద్రబోస్, ఖమ్మం సిటీ ఏసిపి ఆంజనేయులు, ఏసిపి లు బి.రామానుజం, వెంకటేష్, బసవ రెడ్డి, ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్, కార్పొరేటర్ మురళి, పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందుతోంది : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
Advertisement
తాజా వార్తలు
Advertisement