మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు మందా జగన్నాథం మరణం పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పార్టీకి చేసిన కృషి, సేవలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. మందా జగన్నాథం మృతితో తెలంగాణ ఓ సీనియర్ రాజకీయ నాయకుడిని కోల్పోయిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మందా జగన్నాథం మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సంతాపం తెలిపిన కేటీఆర్, హరీశ్
నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యునిగా సుదీర్ఘకాలం పాటు ప్రజలకు సేవలందించిన మందా జగన్నాథం మృతి చెందడం బాధాకరమని కేటీఆర్ అన్నారు. మందా జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నాలుగు సార్లు నాగర్ కర్నూల్ ఎంపీగా పనిచేసి, రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీకి సేవలందించారు. జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని హరీశ్ రావు అన్నారు. నాగర్ కర్నూల్ ఎంపీగా నాలుగుసార్లు పనిచేసి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. జగన్నాథం ఆత్మకు శాంతి కలగాలని హరీష్ రావు ఆకాంక్షించారు.