Friday, November 22, 2024

గ్రహాన్ని మింగేసిన నక్షత్రం.. అంతరిక్షంలో తొలిసారిగా ఆవిష్కారం

అంతరిక్ష చరిత్రలో తొలిసారి అన్నట్టుగా సూర్యుడి పరిణామంలో ఉన్న ఒక నక్షత్రం గురు గ్రహం పరిణామంలో ఒక గ్రహాన్ని మింగివేయడాన్ని శాస్త్రవేత్తలు తొలిసారిగా వీక్షించారు. అంతరించి పోవడానికి సిద్ధంగా ఉన్న ఒక నక్షత్రం ఒక గ్రహాన్ని మింగివేయడాన్ని మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ), హార్వార్డ్‌ యూనివర్శిటీ, క్యాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తల బృందం కనుగొంది.

- Advertisement -

అదే సూర్యుడు ఉగ్రరూపం దాల్చి సూర్యమండలంలో తనకు దగ్గరగా ఉన్న నాలుగు గ్రహాల్లో భూగ్రహాన్ని మింగివేస్తే ఏం జరుగుతుందనే ఒక ఆందోళనకరమైన భావనకు ఈ ఘటన దారి తీసిందని శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన కిషాలా డే అన్నారు. దాదాపు 10 బిలియన్‌ సంవత్సరాల వయస్సు ఉన్న ఆ నక్షత్రం వయోభారం కారణంగా తన వాస్తవిక పరిమాణం కన్నా లక్షలాది సార్ల పరిమాణానికి పెరిగిపోతూ, అదే సమయంలో శక్తిని కోల్పోతూ గ్రహాన్ని మింగివేసిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement