Tuesday, November 26, 2024

రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. తాజాగా 923 కొత్త కరోనా కేసులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కరోనా మరోసారి ప్రమాదఘంటికలు మోగిస్తోంది. నాలుగో వేవ్‌ పరిస్థితులు స్పష్టమవుతున్నాయి. రోజు వారీ కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ ప్రమాదకరస్థాయి పెరుగుతోంది. రోజువారీ కరోనా కేసులు రాష్ట్రంలో 1000కి చేరువలో ఉన్నాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 923 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటీవలికాలంలో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. తాజా కేసులను కలుపుకుంటే తెలంగాణలో ఇప్పటి వరకు నమోదై న మొత్తం కరోనా కేసుల సంఖ్య 8, 18, 290కు చేరింది. కరోనా నుంచి కోలుకోవడంతో 739 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 5170కు చేరింది.

తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 40, 593మందికి కరోనా టెస్టులు చేశారు. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో 366, కరీంనగర్‌లో 20, మంచిర్యాలలో 30, నల్గొండలో 51, నిజామాబాద్‌లో 28, పెద్దపల్లిలో 34, సిద్ధిపేటలో 22, హన్మకొండలో 22, యాదాద్రి భువనగిరిలో 24 అత్యధిక కేసులు నమోదయ్యాయి. జయశంకర్‌ భూపాలపల్లి, కొమరంభీం ఆసీఫాబాద్‌ జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కరోన కేసులు నమోదయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement