Saturday, November 23, 2024

Space : భూభ్రమణం వేగం పెరిగింది! గతం రికార్డులు గల్లంతు.. అతి చిన్న రోజు అదేనట

భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని తెలిసిందే. సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి సాధారణంగా 24 గంటలు పడుతుందని అందరికీ తెలిసిందే. ఆ సమయాన్ని మనం ఒక రోజుగా పరిగణిస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో భూభ్రమణ వేగం పెరగడం సహజ పరిణామం. అలా వేగం పెరగడం వల్ల రోజుగా పరిగణించే 24 గంటల కాలంలో కొద్ది క్షణాలు తగ్గి రోజు చిన్నబోతుంది. అలా గత జులై 29న రోజుగా పరిగణించే సమయం కాస్త తగ్గింది. ఇంతకీ భూభ్రమణ వేగం పెరగడం వల్ల తగ్గిన సమయం (24 గంటలలో తగ్గిన సమయం) కేవలం 1.59 మిల్లి సెకన్లు. అంటే మిగతా రోజులతో పోలిస్తే.. జులై 29వ తేదీ అతి చిన్న రోజన్నమాట. గతంలోని చిన్నరోజులకన్నా ఇదే అతిచిన్నదట. కొద్ది సంవత్సరాలుగా ,అప్పుడప్పుడు భూభ్రమణ వేగం పెరుగుతోంది. 1960 నుంచి భూభ్రమణ వేగం, రోజు నిడివికి సంబంధించిన గణాంకాలు, రికార్డులు నమోదు చేస్తున్నారు.

2020నుంచి భూభ్రణ వేగం పెరుగుతున్నట్లు గుర్తించారు. ఆ సంవత్సరం జులై 19న భూభ్రమణ వేగం పెరిగి.. రోజు నిడివి (24 గంటలు)లో 1.47 మిల్లి సెకన్ల కాలం తగ్గినట్లు గుర్తించారు. తరువాతి సంవత్సరంలో కూడా భూమి ఇదే రీతిలో వేగాన్ని కొనసాగించింది. మళ్లి ఈ జులై 29న అంతకన్నా వేగం పెరిగి రోజు చిక్కిపోయింది. ఈ విషయాన్ని ఇంట్రెస్టింగ్‌ ఇంజనీరింగ్‌ (ఐఈ) సంస్థ పేర్కొంది. గడచిన 50 ఏళ్లలో చిన్న రోజుల జాబితాను సిద్ధం చేయాలని భావిస్తోంది. భూభ్రమణ వేగంలో మార్పులకు కారణమేమిటో ఇంతవరకూ తెలియలేదు. భూమి లోపలి పొరలు, ఖనిజాలు, సముద్ర తరంగాలు, వాతావరణ మార్పులవల్ల ఇలా జరుగుతూండొచ్చన్నది శాస్త్రవేత్తల ఊహ.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement