కెసిఆర్ ను రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా మాత్రమే అందరూ చూస్తూ ఉంటారు. కానీ కెసిఆర్ లో ఒక కవి కూడా దాగి ఉన్నాడని కొంత మందికే తెలుసు అంటున్నారు నెటిజన్లు. నల్లగొండ తాగు నీటి కష్టాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ గారు చలించిపోయి స్వయంగా ఓ పాట రాశారట. ఆ పాటను స్వయంగా మినిస్టర్ హరీష్ రావు అసెంబ్లీ సాక్షిగా పాడారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన హరీష్ రావు ఈ పాటను పాడి వినిపోయించారు. చూడు చూడు నల్లగొండ… గుండె మీద ఫ్లోరైడ్ బండ.. బొక్కలొంకరుబోయిన బతుకులా..మన నల్లగొండ.. దుఃఖమెల్లాదీసేదెన్నాళ్లు… ఈ పాట వింటుంటే నల్లగొండ బారిన ఫ్లోరైడ్ పరిస్థితులు కళ్ల ముందు కదలాడుతున్నాయి కదా అంటూ హరీష్ రావు పాడారు.
అయితే నెటిజన్స్ మాత్రం కెసిఆర్ పై కామెంట్లు చేస్తున్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఫార్మ్ హౌస్ లో, ప్రగతి భవన్ లో మరి ఇంకేం పని ఉంది అంటూ సెటైర్లు వేస్తున్నారు.