కరోన కోరల్లో చిక్కి ప్రాణాలు కోల్పోతున్న వారిని అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాని సంఘటన చూస్తూనే ఉన్నాం, కానీ కన్నతండ్రి కోవిడ్ తో కాకుండా అనారోగ్యంతో చనిపోయాడని తెలిసిన వచ్చి తలకొరివి పెట్టేందుకు కొడుకు నిరాకరించాడు, దీంతో అనాధ శవం గా అంత్యక్రియలు పూర్తి చేశారు.
వివరాల్లోకి వెళ్తే కృష్ణాజిల్లా చిన్న తాడినాడ యవరంపాడు కు చెందిన రాంబాబు తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. దీనితో దివ్యాంగుడు అయినా అల్లుడు నరసింహారావు మోటార్ సైకిల్ పై కూర్చోబెట్టుకుని వైద్యం నిమిత్తం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తుండగానే రాంబాబు మోటార్ సైకిల్ పైన మృతిచెందడంతో ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు పరిశీలించి మృతిచెందాడని నిర్ధారించారు.
వెంటనే కరోనా పరీక్ష చేయగా నెగిటివ్ రావడంతో మృతుడు కుమారుడు కు ఫోన్ చేసి తండ్రి చనిపోయిన సమాచారం అందించారు. ప్రస్తుతం తాను ఊర్లో లేను మీరే కానిచేయండి అంటూ ఆ కొడుకు సమాధానం ఇచ్చాడు. దీంతో సిబ్బంది అవాక్కయ్యారు. చిన్న తాడినాడ సర్పంచ్ కు సమాచారం అందించగా కార్యదర్శి ,సచివాలయ ఉద్యోగులను పంపి మృతదేహాన్ని తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.