Monday, November 18, 2024

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం

రోజురోజుకు చ‌లి తీవ్ర‌త పెరుగుతూ వ‌స్తుంది. దీనికి తోడు ద‌ట్ట‌మైన పొగ మంచు కూడా అలుముకోవ‌డంతో ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు రోడ్ల‌పై 50 మాట‌ర్ల దూరంలో ఉన్నవి క‌నిపించ‌ని ప‌రిస్థితి. దీనికి తోడు గాలిలో నాణ్యత కూడా లోపిస్తుండడంతో మరింత కనిపించని పరిస్థితి ఏర్పడుతుంది. పొగమంచు కారణంగా విజిబిలిటీ 50 మీటర్ల కంటే దిగువకు పడిపోవడంతో రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా మారడం కూడా పొగమంచు దట్టంగా కమ్మడానికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఉదయం ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (గాలి నాణ్యత సూచీ) 315కు పడిపోయింది. ఢిల్లీ యూనివర్సిటీ, ఐఐటీ ఢిల్లీ ఏరియాల్లో AQI 309గా ఉన్నది. లోధి రోడ్‌ ఏరియాలో కాస్త తక్కువగా 301 ఉన్నది. మథుర రోడ్‌లో అత్యధికంగా 331 స్థాయికి గాలి నాణ్యత పడిపోయింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు టర్మినల్‌లో 332గా నమోదైంది. ఈ మధ్య ఢిల్లీలో వాయు కాలుష్యం ఆందోళనకరంగా మారుతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement